Breaking News

విజయవాడ 44వ డివిజన్: జోగేశ్వరరావు విస్తృత ప్రచారం!

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్‌లో కూటమి తరఫున పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బెవర జోగేశ్వరరావు తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తనకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బుద్ధ వెంకన్నలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

డివిజన్‌లోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించడమే తన ప్రథమ లక్ష్యమని జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తాగునీటి ఎద్దడి నివారణ, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తానని పేర్కొన్న ఆయన, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు అంకితమవుతానని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *