Breaking News

పెళ్లికి అడ్డొస్తుందని దారుణం.. ఏలూరు జిల్లాలో ప్రియురాలి హత్య!

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రావులపర్రులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో 41 ఏళ్ల సంధ్యారాణి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్ అజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రావులపర్రుకు చెందిన సంధ్యారాణి, డ్రైవర్ అజయ్ మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అజయ్‌కు వేరే మహిళతో వివాహం నిశ్చయం కావడంతో సంధ్యారాణిని దూరం పెట్టడం ప్రారంభించాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. సంధ్యారాణి తన పెళ్లికి అడ్డుగా మారుతుందని భావించిన అజయ్.. ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు.

అక్టోబర్ 23న సంధ్యారాణిని అద్దె కారులో నాచుగుంట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు, కత్తితో మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, ఫోన్‌ను తీసుకుని, ఆధారాలు లభించకుండా మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాచుగుంట అటవీ ప్రాంతంలో లభించిన మృతదేహాన్ని సంధ్యారాణిగా నిర్ధారించి, నిందితుడు అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కత్తి మరియు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *