Breaking News

మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు లెక్క చెప్పాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). మోర్తాడ్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో 100…

Read Full News

చిన్న శక్కర్గ సర్పంచ్ దిగంబర్‌కు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పరామర్శ

నిజామాబాద్:, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్‌లోని హోప్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్న శక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్‌ను ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడిన వారు దిగంబర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దిగంబర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆకాంక్షించారు.

Read Full News

మూడు దశాబ్దాల మావోయిస్టు ప్రస్థానానికి ముగింపు

సీనియర్ డీసీఎం నక్కా సుశీల రాణి పోలీసుల ఎదుట లొంగుబాటురూ.5 లక్షల రివార్డు.. రూ.25 వేల తక్షణ ఆర్థిక సాయం నిజామాబాద్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సీనియర్ డీసీఎం నక్కా సుశీల రాణి అలియాస్ లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఎదుట లొంగిపోయారు. 1992లో ప్రారంభమైన ఆమె మావోయిస్టు ప్రస్థానానికి నేడు ముగింపు పలికారు. ఆమె…

Read Full News

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం: కలెక్టర్ అంకిత్

భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలి – ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలియంగ్ ఇండియా పాఠశాల పనులను వేగవంతం చేయాలినిర్లక్ష్యంపై ఆర్‌ఐ, ఎంపీడీవోకు చర్యలకు ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. అధికారులు పరస్పర సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో మంగళవారం…

Read Full News

వినాయకుడిని దర్శించుకున్న గుండు రవికుమార్ కుటుంబ సభ్యులు

పాల్వంచ,సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి).గాంధీనగర్ 44వ డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జ్ గుండు రవికుమార్ (రవన్న) తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా కేసుపాక లక్ష్మి, కోయిల, పద్మ, దుర్గ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి గణనాథుడికి పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భక్తులకు శుభాకాంక్షలు…

Read Full News

ఉద్యోగులతో పెట్టుకుంటే కాంగ్రెస్ ఓటమి ఖాయం: కల్వకుంట్ల కవిత !

ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏనాడూ మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కవిత వ్యాఖ్యలు & ముఖ్య ఆరోపణలు

Read Full News

22ఏ భూముల సమస్య తీవ్ర రూపం దాల్చింది:ఎంపీ రఘునందన్ రావు

తెలంగాణలో 22ఏ (Section 22A) నిషేధిత జాబితా భూముల సమస్య తీవ్రరూపం దాల్చిందని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది సామాన్య ప్రజలు తమ భూముల రిజిస్ట్రేషన్లు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ వ్యాఖ్యలు & రఘునందన్ రావు ప్రధాన విమర్శలు

Read Full News

హయత్‌నగర్ లారీ-RTC బస్సు ప్రమాదం…

హైదరాబాద్‌ నగరం శివార్లలోని హయత్‌నగర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ వద్ద వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్‌టీసీ (RTC) బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్య వివరాలు & ప్రస్తుత పరిస్థితి

Read Full News

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ 5కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం!

హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, షియా ఇస్మాయిలీ ముస్లింల 50వ వంశపారంపర్య ఇమామ్ మరియు ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (AKDN) ఛైర్మన్ అయిన ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ 5తో భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ…

Read Full News

కేటీఆర్ పీఏ, పీఆర్ఓపై గూండాలు దాడి: రేవంత్ పాలనపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే తన పీఆర్‌ఓ మాణిక్య మహేశ్‌, పీఏ మహేందర్ రెడ్డిపై ముసుగులు ధరించిన 15 మంది గూండాలు దాడికి పాల్పడ్డారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. కేటీఆర్ ప్రధాన ఆరోపణలు & డిమాండ్లు

Read Full News