Breaking News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్‌లో భాగంగా కార్యక్రమం 14 పాఠశాలల్లో 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు 170 మందికి ఉచిత మందులు.. అనంతరం అద్దాల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ తరఫున చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్…

Read Full News

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి: లైసెన్స్ రద్దుకు నివేదిక!

హైదరాబాద్: భాగ్యనగరంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ విరుచుకుపాటును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రముఖ ‘M/s బహార్ బిర్యానీ కేఫ్’లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నిల్వ ఉంచిన నాణ్యత లేని ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో హోటల్ వంటగది నుంచి సుమారు 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన…

Read Full News

బ్యాంక్ ఖాతాల్లో రూ. 3 కోట్లు… కోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి!

హైదరాబాద్: సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ మాజీ అడ్మినిస్ట్రేటర్ ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) తన బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పైరసీ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీజ్ చేసిన తన ఖాతాల్లోని నిధులను తిరిగి విడుదల చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ…

Read Full News

22-A భూసమస్యలకు చెక్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

హైదరాబాద్: రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా వేధిస్తున్న 22-A (నిషేధిత భూముల) సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 22-A పరిధిలోని 12 ప్రధాన అంశాలను ప్రభుత్వం గురింఛిందని, సమస్య పరిష్కారానికి త్వరలోనే సమగ్ర విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) భూముల వ్యవహారంలోనూ త్వరలోనే నూతన విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. హెచ్‌ఎండిఏ (HMDA), డీటీసీపీ (DTCP) వంటి నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన అధీకృత లేఔట్లలో…

Read Full News

అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా: మంత్రి సవితమ్మ

కక్ష సాధింపు రాజకీయాలు మా విధానం కాదుసూపర్ సిక్స్ హామీల్లో 90 శాతం అమలు చేశాంపెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు పెనుకొండ, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి)  నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 26 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులు చేపడతామని చెప్పారు. పెనుకొండ…

Read Full News

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు శుభాకాంక్షలు

భీంగల్, సెప్టెంబర్ 16: (E6tv NEWS: ప్రతినిధి). టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీంగల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్…

Read Full News

అవసరమైతే ఇవాళే రాజీనామా చేస్తా:అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే ఆర్మ్‌ర్ రాకేశ్‌ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, కేవలం కొడంగల్, పరిగి వంటి కొన్ని కొన్ని ప్రాంతాలకే భారీగా నిధులు కేటాయిస్తూ తమ జిల్లాను విస్మరిస్తున్నారని సభలో మండిపడ్డారు. ఆర్మూరులో నిజాం కాలంలో నిర్మించిన ఎంఆర్‌వో, సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాలు కూలిపోయే స్థితికి చేరాయని, క్లర్క్ స్థాయి అధికారి కూర్చోవడానికి…

Read Full News

తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సింగపూర్ సన్నాహాలు

శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పురోగతిని ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్…

Read Full News

QRతో గణేష్ నిమజ్జనం పాయింట్:Cyberabad అధికారులు!

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం కోసం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఒక వినూత్న డిజిటల్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు తమ సమీపంలోని నిమజ్జన ప్రాంతాలను (Immersion Points) సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక QR కోడ్‌తో పాటు ఆన్‌లైన్ లింక్‌ను విడుదల చేసింది. సైబరాబాద్ వ్యాప్తంగా మొత్తం 53 నిమజ్జన ప్రాంతాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ టూల్ ద్వారా భక్తులు తమ ఫోన్ లోకేషన్ ఆన్ చేసి సమీపంలోని నిమజ్జన ఘాట్‌లు,…

Read Full News

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి: బిజెపి డిమాండ్!

హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీన ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ శాసనసభలో భారతీయ జనతా పార్టీ (BJP) వాయిదా తీర్మాన నోటీస్ ఇచ్చింది. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుంచి విమోచనం లభించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజుకు తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను…

Read Full News