Breaking News

సంతోష్‌నగర్ కిడ్స్ స్కూల్‌లో అగ్నిప్రమాదం: తప్పిన ముప్పు!

హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ రోడ్‌లో ఉన్న ఓ రెండు అంతస్థుల ప్రైవేట్ కిడ్స్ స్కూల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో పాఠశాల, రెండో అంతస్తులో నివాస గృహం ఉండటంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై భవనంలోని వారిని ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు, ఫైర్…

Read Full News

గణనాథుడికి కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు!

హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవెల్లి నివాసంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ధార్మిక క్రతువులో కేసీఆర్, ఆయన సతీమణి శోభలతో పాటు కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా పాల్గొని తాత, నానమ్మలతో కలిసి ఏకదంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ వారు మట్టి వినాయకుడికే పూజలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్…

Read Full News

పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందన..

విదేశీ ఉద్యోగాల పేరిట కోట్లాది రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల నోటీసుల ప్రకారం సెప్టెంబర్ 16 వరకు సమయం ఉన్నప్పటికీ, ఒకరోజు ముందే ఆమె న్యాయవాదులతో కలిసి మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు ఆమెపై 20కి పైగా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కన్సల్టెన్సీ వ్యవహారాలు,…

Read Full News

చివరి రోజు సభ ముందుకు రానున్న అత్యంత కీలక బిల్లులు…

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. మూడు రోజుల విరామం అనంతరం మొదలైన ఈ సెషన్ చివరి రోజైన నేడు, సభ ముందుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక బిల్లులు రానున్నాయి. సభను మరో రోజు పొడిగించడంతో నేటి అజెండా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. శాసనసభలో ఉదయం ప్రారంభమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం తీవ్ర ఉత్కంఠగా సాగుతోంది. నేడు సభలో ప్రధానంగా నిషేధిత భూముల జాబితా (Section 22A) వివాదం మరియు ఎల్‌నినో ప్రభావాలపై…

Read Full News

ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్: షాక్‌లో గణేష్ ఉత్సవ కమిటీలు!

హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ప్రసిద్ధ ట్యాంక్ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు సూచనల మేరకు సిటీ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల పేరిట ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా వెలిసిన హెచ్చరిక ఫ్లెక్సీలు ప్రస్తుతం నగరంలో తీవ్ర హాట్ టాపిక్‌గా మారాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, కోర్టు నిబంధనలకు లోబడి ఉత్సవ…

Read Full News

బిందెల కాలనీ భూ సమస్యపై 17న ప్రజా ధర్నా

అనంతపురం, సెప్టెంబర్ 16:(E6tv NEWS: ప్రతినిధి). బిందెల కాలనీలోని సర్వే నంబర్లు 189/3, 75లో ఉన్న భూముల సమస్యపై దాదాపు 22 నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ప్రజా ఉద్యమ నేత సాకే గోవింద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పేదల స్థలాలను కాపాడాలని, అక్రమ జోక్యాలను అడ్డుకోవాలని, వాస్తవ రికార్డులను…

Read Full News

చక్రం గుడిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాస కల్యాణం ఘనంగా నిర్వహణ

నిజామాబాద్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ నగరంలోని చక్రం గుడిలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మాస కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సుందరంగా అలంకరించి మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమైన కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. వేద మంత్రోచ్ఛారణలు,…

Read Full News

అడవి సిరికి.. ఆన్‌లైన్‌ దారి!

ఆదివాసి ఉత్పత్తులకు డిజిటల్‌ రెక్కలు.. ఇంటికే గిరి ఉత్పత్తులు భద్రాచలం, సెప్టెంబర్‌ 15:(E6tv NEWS: ప్రతినిధి) అడవిలో పండిన ఉత్పత్తులకు గిరిజనుల చేతుల మీదుగా విలువ జోడించి.. వాటిని దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ చేసేందుకు భద్రాచలంలోని భద్రగిరి మార్ట్‌ మరో ముందడుగు వేసింది. గిరిజనుల శ్రమకు సరైన గిట్టుబాటు కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించే లక్ష్యంతో మార్ట్‌ను పర్యాటక రంగంతో అనుసంధానం చేసి, ఆన్‌లైన్‌ విక్రయాలకు శ్రీకారం చుట్టారు. అడవి ఉత్పత్తులకు ‘భద్రగిరి…

Read Full News

మోర్తాడ్‌లో పోషణ మాసం కార్యక్రమం

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన మోర్తాడ్, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎస్సీ సంఘం భవనంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరికొండ, వేల్పూర్, భీంగల్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కార్యక్రమానికి హాజరై పోషకాహార స్టాళ్లను సందర్శించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన వివిధ ఆహార పదార్థాలను పరిశీలించి,…

Read Full News

మంత్రి సవిత రేపటి పర్యటన వివరాలు

పెనుకొండ, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర మంత్రి సవిత బుధవారం (సెప్టెంబర్ 16) పెనుకొండ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మంత్రి కార్యాలయం వెల్లడించిన పర్యటన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల్లో మంత్రి సవిత పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అనంతరం ఉదయం 11 గంటలకు రొద్దం మండలం గోనిమేకలపల్లి గ్రామంలో ఇటీవల మృతి…

Read Full News