Breaking News

భీంగల్ ఐదో వార్డులో బోరు మోటార్ ప్రారంభం

15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు భీంగల్: భీంగల్ పట్టణంలోని ఐదో వార్డు బోయగల్లిలోని జండాగల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను ఐదో వార్డు కౌన్సిలర్ బోదిరే లావణ్య నరసయ్య ప్రారంభించారు. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోరు మోటార్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి…

Read Full News

గురువులదే దేశ భవిష్యత్తుకు అసలైన పునాది

సమాజంలోని అన్ని రంగాల అభివృద్ధికి గురువులే ఆద్యులు తల్లిదండ్రులతో సమానమైన దైవిక స్థానం ఉపాధ్యాయులదే బడ్జెట్ పాఠశాలల్లో 80 శాతం మంది మహిళా సిబ్బందే నిజామాబాద్ జిల్లాలో 60 బడ్జెట్ పాఠశాలల ద్వారా 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉత్తమ ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డులు అభినందనీయం బడ్జెట్ స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) సమాజ నిర్మాణంలో…

Read Full News

బాల్కొండలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలు

బాల్కొండ, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ పట్టణ శాఖ అధ్యక్షుడు కుందారం శ్రీనివాస్‌తో పాటు మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సట్ల ప్రవీణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సట్ల ప్రవీణ్ నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్…

Read Full News

మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ

గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కల పంపిణీ పాల్వంచ, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని భజన మందిరం రోడ్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కలను పంపిణీ చేశారు. భారీ పరిశ్రమల కారణంగా పాల్వంచ ప్రాంతంలో పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పర్యావరణహిత గణపతి…

Read Full News

విచారణా..? కంటితుడుపు చర్యా..?

బాధితుల వాంగ్మూలాలు తీసుకోకుండానే విచారణ పూర్తి చేస్తారా? పై హోదాలో ఉన్న అధికారిపై కింది స్థాయి అధికారి విచారణ ఎలా? గత నివేదికల్లో వైరుధ్యాలున్నాయంటున్న ఫిర్యాదుదారులు కొత్తగూడెం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖలో చేపట్టిన తాజా విచారణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్ నుంచి వచ్చిన ఎస్‌ఈ స్థాయి అధికారి కొత్తగూడెం డీఈ కార్యాలయంలో కొందరు ఉద్యోగుల నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు సమాచారం. అయితే గతంలో…

Read Full News

CAPCOను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాం

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు మరింత విస్తృతంగా కృషి16వ జాతీయ వినియోగదారుల సదస్సు ఘనంగా ముగింపు పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). వినియోగదారుల హక్కుల పరిరక్షణ, ప్రజల్లో వినియోగదారుల చైతన్యం పెంపొందించడంలో గత 35 సంవత్సరాలుగా కృషి చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ (CAPCO)ను దేశంలోనే అగ్రగామి వినియోగదారుల సమాఖ్యగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని CAPCO ఆంధ్రప్రదేశ్ చైర్మన్ జి. సురేష్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం…

Read Full News

సిల్క్ సిటీ… గ్రీన్ సిటీగా మారాలి

కాలుష్యరహిత ధర్మవరం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: పరిటాల శ్రీరామ్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ధర్మవరం, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి). పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం పట్టణం సిల్క్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత పట్టణంగా అభివృద్ధి చెందాలని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో…

Read Full News

కొత్త ఓటర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

మద్నూర్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఆదివారం కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ శిబిరం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుంచి కొత్త ఓటరు నమోదు దరఖాస్తులతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నాలుగు విడతలుగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టినట్లు బీఎల్వోలు…

Read Full News

సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

నిజాం-రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి: కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య బాల్కొండ, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం…

Read Full News

రైతన్న కంట కన్నీరు.. బత్తలపల్లిలో కరువు కష్టాలు

అడుగంటిన భూగర్భ జలాలు.. ఎండిపోతున్న వేల ఎకరాల ఉద్యాన పంటలు కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ బత్తలపల్లి, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి) ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దేవరగుడి జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యానవన రైతులు తీవ్ర…

Read Full News