Breaking News

టీజీ ఆర్టీసీ గుర్తుల వివాదం హైకోర్టు జోక్యం..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గుర్తు కేటాయింపు వివాదంలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది.

ఈ ఎన్నికల్లో తమకు గతంలో ఉన్న ‘విల్లు-బాణం’ గుర్తుకు బదులుగా ‘నిచ్చెన’ గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పి. శ్రీదేవి ధర్మాసనం విచారణ జరిపింది.

ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సదరు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *