Breaking News

జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఫైర్.. కూల్చివేతలపై నిలదీత!

భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించిన తర్వాత మళ్లీ కూల్చివేతలకు దిగడంపై తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్కాజ్‌గిరి డిఫెన్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ‘హైడ్రా’ చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ విచారణ చేపట్టారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ లేఅవుట్లలోని ప్రజా వినియోగ స్థలాల పేరుతో రెవెన్యూ, హైడ్రాలకు లేఖలు రాయడంపై జీహెచ్‌ఎంసీ వైఖరిని కోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో స్పష్టతనిస్తూ కౌంటర్లు దాఖలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, హైడ్రాలకు చివరి అవకాశంగా మూడు వారాల గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *