Breaking News

వట్టినాగులపల్లిలో జూదంపై ఉక్కుపాదం.. 27 మంది అరెస్ట్!

హైదరాబాద్‌ శివారులోని వట్టినాగులపల్లిలో నిర్వహిస్తున్న ఒక పేకాట స్థావరంపై గచ్చిబౌలి పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ జూద శిబిరంపై దాడి చేసి 27 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అక్కడి నుంచి రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలలుగా ముగ్గురు వ్యక్తులు నిర్వాహకులుగా వ్యవహరిస్తూ ఇక్కడ ప్రతిరోజూ సుమారు రూ. 20 లక్షల మేర లావాదేవీలు సాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *