Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు

ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు స్థానిక సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

పుట్టపర్తి, అక్టోబర్ 20 (E6tv న్యూస్).

శ్రీ సత్యసాయి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ఎన్నికల విధులకు వినియోగించే పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ తెలిపారు.2026 స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో పలు పాఠశాలలు, కళాశాలల భవనాలను పోలింగ్ కేంద్రాలు, పంపిణీ–స్వీకరణ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంబంధిత విద్యాసంస్థలకు నిర్దేశిత తేదీల్లో స్థానిక సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

సెలవులు ప్రకటించిన తేదీలు ఇవే..

అక్టోబర్ 27: పోలింగ్‌కు ముందు రోజు

అక్టోబర్ 28: పోలింగ్ రోజు

అక్టోబర్ 29: ఓట్ల లెక్కింపునకు ముందు రోజు

అక్టోబర్ 30: ఓట్ల లెక్కింపు రోజు

    ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టేందుకు ఈ నాలుగు రోజుల పాటు సంబంధిత పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవులు వర్తిస్తాయని కలెక్టర్ తెలిపారు.ఎన్నికల విధుల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *