వరంగల్ తూర్పు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ తన రాజకీయ ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తానని ఘాటుగా హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు గాలిలో కత్తులు తిప్పుతున్నారంటూ మండిపడ్డారు. హద్దులు మీరి ప్రవర్తించే నాయకులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా ఆమె మాట్లాడారు. పార్టీ నాయకులు తమ మధ్య ఉన్న వర్గ విభేదాలను పక్కన పెట్టి, పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అందరూ కలసికట్టుగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు.
