ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు దాదాపు 237 మంది విపక్ష ఎంపీలు ఢిల్లీలో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు రహదారులను దిగ్బంధించి, ఆందోళనకారులను అడ్డుకోవడంతో పాటు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను బలవంతంగా పోలీస్ బస్సులోకి ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి భవన్ వద్ద నిరసన తెలిపినందుకు గాంధీ తోబుట్టువులపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వివాదాస్పద నిర్ణయాల వల్ల 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని విపక్షాలు ఆరోపిస్తుంటే, శాంతిభద్రతల పరిరక్షణకే ఈ చర్యలు తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ (INDIA) కూటమికి చెందిన దాదాపు 300 మంది ఎంపీలు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కన్నాట్ ప్లేస్‌లోని ‘సాగార్ రత్నా’ రెస్టారెంట్లో విపక్ష ఎంపీలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, నిన్నటి ఆందోళనల నేపథ్యంలో తనపై నమోదైన పోలీసు కేసుల గురించి ప్రస్తావిస్తూ “నాపై నమోదయ్యే ప్రతీ ఎఫ్ఐఆర్ నాకు ఒక పతకం లాంటిది” అని వ్యాఖ్యానించారు.
