బోధన్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి)
బోధన్ పట్టణంలోని రైతు డిపో వద్ద సెప్టెంబర్ 25న రైతు రామ్‌సింగ్, రైతు డిపో యజమాని జగన్నాథరావు మధ్య నెలకొన్న సమస్యపై నిర్వహించిన ధర్నాకు పరిష్కారం లభించిందని సీపీఎం నాయకులు తెలిపారు.
సోమవారం ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం, బెల్లాల్ గ్రామ ప్రజలు, వామపక్ష పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇరువర్గాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు తెలిపారు.రైతు రామ్‌సింగ్, రైతు డిపో యజమాని జగన్నాథరావు ఇకపై ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు, బెల్లాల్ గ్రామ ప్రజలకు రైతు కుటుంబం, రైతు డిపో యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు, బోధన్ మండల కార్యదర్శి ఏషాల గంగాధర్, సీపీఐ(ఎంఎల్) నాయకుడు పుట్ట వరదయ్య, టీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ బుర్రి లక్ష్మణ్, దళిత సంఘం నాయకుడు విద్యాసాగర్, కమ్మ సంఘం నాయకులు పరమేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
