Breaking News

విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం

నిర్మల్, అక్టోబర్ 31 (E6tv న్యూస్).

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ హైస్కూల్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డీఎల్ఎస్ఏ సెక్రటరీ పి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అడ్వకేట్లు రాజేశ్వర్ రత్నం, ఎస్. నరేందర్, వి. మధుకర్, ఎస్‌ఐ సాయి సిద్ధార్థ్ పాల్గొని విద్యార్థుల హక్కులు, బాధ్యతలు, న్యాయ సేవల ప్రాముఖ్యత తదితర అంశాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే చట్టాల పట్ల అవగాహన పెంపొందించుకుంటే భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మురాద్ అలీ పరిష్తే, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *