Breaking News

నెల్లూరులో ఉద్రిక్తత మైనారిటీ నేత అరెస్ట్..!

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ నెల్లూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ మైనారిటీ నేత అబ్దుల్ మస్తాన్ అరెస్టయిన నేపథ్యంలో, ఆ పార్టీ నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పార్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోటమిట్టలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మైనారిటీ నేతలతో కలిసి నెల్లూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన, మస్తాన్ ఆచూకీపై పోలీసులను వివరాలు కోరారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని, ఆందోళన చెందవద్దని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అధికార కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు విరమించుకునేలా ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి మస్తాన్ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఆయన విడుదలకు పోరాటం చేస్తామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *