పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి వ్యాసరచన పోటీలు
ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్).
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డి పోలీస్ సర్కిల్ పరిధిలోని సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వ్యాసరచన పోటీల్లో ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిర్వహించే బాధ్యతలను గుర్తుచేసుకుంటూ అమరవీరుల సేవలను గౌరవించారు.పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి స్ఫూర్తిని సిబ్బందిలో పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
