Breaking News

ముఖ్యమంత్రి సభకు భారీగా తరలిన నీలం మధు కాంగ్రెస్ శ్రేణులు

సీఎం సభకు కదిలిన నీలం దండు

40 వాహనాలతో సిద్దిపేటకు బయలుదేరిన పటాన్‌చెరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు

పటాన్‌చెరు, నవంబర్ 19: (E6tv NEWS)

సిద్దిపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సుమారు 40 వాహనాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సిద్దిపేటకు బయలుదేరారు.ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కూల్‌లో ఉన్న మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. నీలం మధు స్వయంగా జెండా ఊపి కార్ల ర్యాలీని ప్రారంభించారు.

ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యాంపు కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పార్టీ జెండాలు చేతబూని, నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా సిద్దిపేటకు బయలుదేరారు. వరుసగా వాహనాలు కదలడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో పటాన్‌చెరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో తరలివెళ్లారు. నీలం మధు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *