మద్యం విక్రయాలు నిలిపివేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు
చర్యలు తీసుకోవాలని అధికారులను కోరిన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు
రుద్రూర్, అక్టోబర్ 27 (E6tv న్యూస్).
గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేపడుతున్నారని, వీటిని తక్షణమే నిలిపివేయాలని రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో మద్యం వినియోగం పెరగడంతో కొంతమంది మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం రుద్రూర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాయకూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మద్యం విక్రయాలను నిలిపివేసి, బెల్ట్ షాపు నిర్వహణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మద్యం విక్రయాల వల్ల కుటుంబాలు, యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
రాయకూర్లో మద్యం విక్రయాలపై వచ్చిన ఫిర్యాదును అధికారులు పరిశీలించి, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
