అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించిన ఓ ఉన్మాది, పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై చెట్లను కోసే ఎలక్ట్రిక్ రంపంతో పాశవిక దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు కాగా, దాడిని అడ్డుకోవడానికి యత్నించిన మరో విద్యార్థినికి కూడా గాయాలయ్యాయి. పాఠశాలలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో నిందితుడిని పనిమనిషిగా పొరబడినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, పరారైన నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
పాఠశాలలో దారుణం: పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి!
