ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రతిపాదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు జాతి సంపద అని, వాటి ఆస్తుల విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపడం వెనుక అంతరార్థమేమిటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. రిజర్వ్ ధర కంటే తక్కువకు బిడ్లు వచ్చినప్పుడు మదింపు నిబంధనలను ఎందుకు మార్చారని, బ్యాంక్ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ఐడీబీఐకి ఉన్న అత్యంత విలువైన స్థిరాస్తుల విలువను సరిగ్గా లెక్కించారో లేదో ప్రజలకు కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణపై కేంద్రంపై కేటీఆర్ ఫైర్!
