‘అర్నాబ్’ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తమిళనాడు సహకారాన్ని కోరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. తుపాను వల్ల కలిగిన నష్టాన్ని వివరించి, విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బందిని, సామగ్రిని పంపాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తికి తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సాయం అందించేందుకు హామీ ఇచ్చింది. కాగా, ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సిబ్బంది కూడా ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు.
విద్యుత్ కోసం తమిళనాడు సాయం కోరిన ఏపీ!
