Breaking News

బాక్సాఫీస్ వద్ద ‘ఆదర్శ కుటుంబం’ జోరు.. తొలిరోజే రూ.16.65 కోట్లు!

విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నంబర్‌ 47’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధికంగా రూ. 9.25 కోట్ల గ్రాస్ నమోదవగా, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 5.50 కోట్లు వచ్చాయి. ఈ వసూళ్లతో 2026లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-7 తెలుగు చిత్రాల జాబితాలో వెంకటేశ్ సినిమా చోటు దక్కించుకోవడమే కాకుండా, ఇటీవల వచ్చిన ‘రణబాలి’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాల రికార్డులను అధిగమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *