Breaking News

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రాకుండా పారిపోతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. ‘ఓటు చోరీ’ అనే పదాన్ని సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంటోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా ఓటు చోరీ జరగలేదని, రాహుల్ గాంధీ దగ్గర ఆధారాలు ఉంటే పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే సవాల్ విసిరిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కాంగ్రెస్ కేవలం అసత్య ప్రచారాలు మాత్రమే చేస్తోందని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *