Breaking News

తేని జైలు వ్యవహారంపై సీఎం విజయ్ సీరియస్..!

తమిళనాడులోని తేని జిల్లా టెక్కంపట్టి సబ్-జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారైన ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. ఈ విధి నిర్వహణ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు చేపడుతూ తేని జైలు సూపరింటెండెంట్ నాగేశ్వరన్‌తో పాటు మరో 9 మంది సిబ్బందిని సస్పెండ్ చేయగా, ఒక సీనియర్ అధికారిని బదిలీ చేశారు. ఖైదీలు జైలు గార్డులపై దాడి చేసి పరారైనప్పటికీ, పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలతో రెస్క్యూ చేపట్టి 17 మంది ఖైదీలను తిరిగి పట్టుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో భద్రతను, నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని అధికారులకు సీఎం విజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *