Breaking News

తుపాను నష్టాల అంచనాకు ఏపీకి కేంద్ర బృందం!

‘ఆర్నబ్’ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా అంచనా వేసేందుకు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం శనివారం అమరావతికి చేరుకుంది. తుపాను కారణంగా రాష్ట్రంలో 12 జిల్లాల్లో ప్రాథమికంగా రూ. 4,764 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆర్టీజీఎస్ (RTGS) అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విసృతంగా వివరించారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణలో ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్న ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలను కేంద్ర బృందం ప్రత్యేకంగా అభినందించింది. రెండు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *