రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దుండ్ర కుమారస్వామికి పట్టభద్రులు, నిరుద్యోగ యువత విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్ రిజిస్ట్రేషన్, జాబ్ మేళా కార్యక్రమంలో భాగంగా దాదాపు 2,500 మంది పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ ముఖాముఖిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వాల హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి రావాలని, నిరుద్యోగులు, పట్టభద్రుల గొంతుకగా శాసనమండలిలో తమ సమస్యలను వినిపించేందుకు కుమారస్వామి పోటీ చేయాలని యువత కోరింది. వారి విజ్ఞప్తిపై కుమారస్వామి సానుకూలంగా స్పందిస్తూ, ఎమ్మెల్సీగా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
దుండ్ర కుమారస్వామి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని యువత విజ్ఞప్తి!
