ఓటర్ల జాబితాలో అక్రమాలు, అక్రమ తొలగింపులను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ గుప్తాపై ‘ఇండియా’ కూటమి నాయకులు శనివారం న్యూఢిల్లీలోని మల్లికార్జున ఖార్గే నివాసంలో ప్రతీకాత్మకంగా ‘మాక్ పార్లమెంట్’ ద్వారా ప్రజా ఇంపీచ్మెంట్ నిర్వహించారు. సీఈసీ ఓటర్ల జాబితాపై కేంద్రీకృత నియంత్రణ సాధించారని ఖార్గే ఆరోపిస్తూ.. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని, కొత్త సీఈసీ నియామక చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ వంటి వ్యక్తులు రాజ్యాంగ పదవుల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి ముప్పు పెరుగుతుందని మండిపడ్డారు. ఈ మాక్ ఇంపీచ్మెంట్ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖార్గే, మీరా కుమార్ తదితర ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి మాక్ ఇంపీచ్మెంట్!
