Breaking News

నూతన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి

వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశం

మెట్‌పల్లి, అక్టోబర్ 31 (E6tv న్యూస్).

మెట్‌పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఇతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.అనంతరం కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్య సిబ్బంది హాజరు, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే ప్రజల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి రోగికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *