దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్ను (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలు) ధరలను సవరించింది. అక్టోబర్ 31 నుంచి అమలులోకి వచ్చేలా డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్ను పెంచగా, పెట్రోల్ ఎగుమతులపై పన్నును రద్దు చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. డీజిల్ ఎగుమతి సుంకం లీటరుకు రూ. 8.50 నుంచి రూ. 11.50కి, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 10.50 నుంచి రూ. 11కి పెంచగా, పెట్రోల్‌పై గతంలో ఉన్న రూ. 2.50 సుంకాన్ని సున్నాకు తగ్గించారు. అయితే దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
కేంద్రం బిగ్ షాక్: డీజిల్ ఎగుమతులపై పన్ను పెంపు!
