పేకాట ఆడుతున్న నలుగురు పట్టివేత.. రూ.3,100 నగదు, మొబైల్, ద్విచక్ర వాహనం స్వాధీనం
ఎల్లారెడ్డి, నవంబర్ 03 (E6tv న్యూస్).
ఎల్లారెడ్డి మండల పరిధిలోని మీసనపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను ఎల్లారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టిన పోలీసులు, పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.3,100 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

