Breaking News

అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పది

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్).

సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అందించిన అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా శుక్రవారం ఇందూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ ఆలోచనా విధానం, దేశసేవ, సామాజిక సమరసత కోసం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.రాజకీయాలను కేవలం అధికార సాధనంగా కాకుండా సమాజ సేవకు ఒక మార్గంగా చూడాలనే భావనతో ఆయన పనిచేశారని అన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దేశానికి అందించిన ముఖ్యమైన సిద్ధాంతాల్లో “ఏకాత్మ మానవవాదం” ఒకటని గుర్తుచేశారు. మనిషి, సమాజం, దేశం పరస్పరం అనుసంధానమై ఉన్నాయని ఆయన వివరించారు.

దేశం కోసం ఆలోచిస్తూ, సమాజం కోసం పనిచేస్తూ, అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పురుషోత్తం, కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్, స్రవంతి వినోద్ రెడ్డి, ప్రసూన శ్రీనివాస్, వైష్ణవి సుధా, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, సుమిత్ర కిషోర్, మండల అధ్యక్షుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *