Breaking News

మళ్లీ పరుగులు తీస్తున్న గోదావరి: కాళేశ్వరం ఎత్తిపోతలతో జలకళ!

తెలంగాణ సాగునీటి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రక్రియను అధికారులు మళ్లీ ప్రారంభించారు. గోదావరి నదిలో నీటి ప్రవాహాలు పెరగడంతో లభ్యతగా ఉన్న జలాలను సద్వినియోగం చేసుకునేందుకు అన్నపూర్ణ, రంగనాయక సాగర్ పంప్‌హౌస్‌లలో మోటార్లను ఆన్ చేశారు. అన్నపూర్ణ పంప్‌హౌస్ ద్వారా దాదాపు 6,400 క్యూసెక్కులను అనంతగిరి రిజర్వాయర్‌లోకి, రంగనాయక సాగర్ పంప్‌హౌస్ ద్వారా 6,600 క్యూసెక్కులను రంగనాయక సాగర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఈ నీటి నిల్వలు పెరగడం వల్ల ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

కాగా, పంపులను వెంటనే ప్రారంభించి రైతులకు నీరందించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి లేఖ రాయడం, ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టడం రాజకీయంగానూ ఆసక్తిని రేకెత్తించింది. ఏది ఏమైనా, వర్షాకాలంలో లభ్యమయ్యే గోదావరి జలాలను వృథా కాకుండా రిజర్వాయర్లలో నింపి రైతులకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతుండగా, నీటి ప్రవాహాల రాకతో స్థానిక రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *