Breaking News

తుని రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురు యువకుల అరెస్ట్

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో మత్తు పదార్థాల అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, సీఐబీ అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో హౌరా–చెన్నై మెయిల్ రైలు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల వద్ద చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని మనోజ్ ప్రధాన్ (27), శంభునాథ్ జనా (29), అజయ్ జనా (25)గా గుర్తించారు. నిందితుల నుంచి ఒక్కొక్కరి దగ్గర మూడు ప్యాకెట్ల చొప్పున గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

పోలీసుల కన్నుకప్పేందుకు అక్రమార్కులు వినూత్న రీతిలో చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను తరలిస్తున్నారని, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఇవి సరఫరా అవుతుండటం ఆందోళనకరమని అధికారులు తెలిపారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఎవరైనా పెద్ద ముఠా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రయాణికులు అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని, అలాగే పిల్లలు తినే తినుబండారాల పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *