వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీతకు వైద్య చికిత్స కోసం LOC అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).
వేల్పూర్ గ్రామానికి చెందిన జమ్మలగిరి వనీత మోకాలి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ఆర్థిక సహాయం అవసరం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని సంప్రదించారు.
వనీత కుటుంబ సభ్యుల విజ్ఞప్తికి స్పందించిన వేముల ప్రశాంత్ రెడ్డి, ఆమె వైద్య చికిత్స కోసం రూ.1,10,000 విలువైన LOC (Letter of Credit) మంజూరు చేయించారు.ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో వనీత కుటుంబ సభ్యులకు LOC కాపీని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించినందుకు వనీత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా సహాయం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

