అర్నబ్ అతి తీవ్ర తుపాను ధాటికి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలుల వల్ల భారీగా విధ్వంసం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 6,000 విద్యుత్ స్తంభాలు, వేలాది వృక్షాలు నేలకొరగడంతో అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకోగా, రహదారులపై చెట్లు కూలి రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, అంబాజీపేట, పి.గన్నవరం తదితర మండలాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. ఈ ఈదురుగాలుల దెబ్బకు వేలాది ఎకరాల్లో కొబ్బరి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం యంత్రాంగం రంగంలోకి దిగి రోడ్లను క్లియర్ చేయడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సహాయక చర్యలను వేగవంతం చేసింది.
కోనసీమలో ‘అర్నబ్’ బీభత్సం: భారీగా పంట నష్టం

