Breaking News

చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం జోరు

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 29: (E6tv NEWS).

చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ-1 అభ్యర్థి ఎస్టీడీ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి రెడ్డిమిగారి హేమలత సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులు గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్ర రెడ్డి, మాజీ జడ్పీటీసీ మైలరాపు గోవింద రెడ్డి, పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రచారంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. గ్రామ ప్రజలు అభ్యర్థులకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *