జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్
నిజామాబాద్, అక్టోబర్ 21: (E6tv న్యూస్:శివ ఠాకూర్).
నిజామాబాద్ జిల్లాలోని మున్నూరు కాపు కుటుంబాల ఐక్యత, ఆత్మీయతను పెంపొందించేందుకు ఈనెల 23వ తేదీన దసరా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు నిజామాబాద్ మాజీ మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు.
ప్రగతినగర్ లోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించనున్న ఈ సమ్మేళనానికి జిల్లాలోని ప్రతి మున్నూరు కాపు కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా కుల బంధువుల మధ్య స్నేహభావం, ఐక్యత , బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కుల బంధువులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ధర్మపురి సంజయ్ వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని, పండుగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.జిల్లాలోని ప్రతి మున్నూరు కాపు కుటుంబ సభ్యుడు ఈ కార్యక్రమానికి హాజరై సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ధర్మపురి సంజయ్ కోరారు.

