Breaking News

గోపన్‌పల్లి తండాలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాగం హరి శంకర్ యాదవ్

శేరిలింగంపల్లి, నవంబర్ 19: (E6tv NEWS).

నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి తండాలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏ. శ్రీరాములు, ఏ. శేఖర్, ఏ. చరణ్ ఆహ్వానం మేరకు నల్లగండ్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగం హరి శంకర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాజు ముదిరాజ్, రవికుమార్, నరసింహ, రమేష్, యాదగిరి, ప్రవీణ్, అరుణ్, లోకేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *