Breaking News

ట్రాఫిక్ కష్టాలకు చెక్: శంషాబాద్, రాజేంద్రనగర్‌లలో 100 ఫీట్ల రోడ్లు!

శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక అడుగు వేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు ప్రధాన 100 అడుగుల రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేస్తోంది. దీనికోసం దాదాపు 23,496 చదరపు గజాల భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా గొల్లాపల్లి NH-44 జంక్షన్ నుండి పెద్ద గోల్కొండ వరకు ఒక కారిడార్, అలాగే ORR సర్వీస్ రోడ్డు నుండి బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్ మీదుగా చేవెళ్ల రోడ్డును కలిపే కారిడార్-19 రోడ్డును విస్తరించనున్నారు. ఈ రహదారులు అందుబాటులోకి వస్తే ORR నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *