Breaking News

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్

ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, అక్టోబర్ 23 (E6tv NEWS).

మానవత్వమే లక్ష్యంగా ఎండీఆర్ ఫౌండేషన్ మరోసారి తన సేవా నిరతిని చాటుకుంది. బీహెచ్ఈఎల్ ఎక్స్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ అందజేశారు. అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని ఫౌండేషన్ సేవా కార్యక్రమాల ద్వారా నిరూపిస్తోంది.ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంతో పాటు, ఆదరణకు నోచుకోని మృతదేహాలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించడం తమ సామాజిక సేవలో భాగమని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *