Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుపై ఈటల పాదయాత్రకు బీజేపీ మద్దతు

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ను శాశ్వతంగా తరలించాలనే డిమాండ్‌తో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ చేపట్టిన ‘మహా పాదయాత్ర’కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌ రావు మద్దతు ప్రకటించారు. ఎదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువు వద్ద ప్రారంభమైన ఈ యాత్రలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్‌ రావు మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డ్‌ వల్ల గాలి, భూగర్భ జలాలు కలుషితమై స్థానిక ప్రజలు, చిన్నారులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శిస్తూ, డంపింగ్ యార్డ్‌ను తరలించే వరకు ఈ పోరాటం మరియు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *