Breaking News

అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావం: సూర్యలంక బీచ్ మూసివేత..

‘ఆర్నబ్‌’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో బాపట్ల జిల్లా సూర్యలంక సముద్రతీరంలో అలల ఉధృతి, గాలుల వేగం పెరగడంతో అధికారులు తీవ్ర అప్రమత్తత వ్యక్తం చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు బీచ్‌కు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పర్యాటకులను లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే సూర్యలంక తీరం నిర్మానుష్యంగా మారింది. మరోవైపు, వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా తమ పడవలను ఆదర్శనగర్‌ కాలువలో సురక్షితంగా నిలిపివేశారు. పర్యాటకులు, తీరప్రాంత ప్రజలు అలల దగ్గరకు వెళ్లకుండా అధికారులు సూచించిన ముందస్తు భద్రతా నిబంధనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *