Breaking News

అర్నాబ్ తుపాను నష్టంపై కేంద్రానికి చంద్రబాబు లేఖ!

అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. రాష్ట్రాన్ని ముంచెత్తిన ఈ విపత్తులో తక్షణమే క్షేత్రస్థాయిలో నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. తుపాను నివారణ మరియు సహాయక చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సవివర నివేదికను త్వరలోనే సమర్పిస్తామని పేర్కొన్నారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు తీవ్రంగా నష్టపోయాయని సీఎం వివరించారు. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో రోడ్లు దెబ్బతినడంతో పాటు 180 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 220కి పైగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగిందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తల వల్ల ప్రాణనష్టం తప్పుతుందని, 28 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *