హైదరాబాద్ రామాంతపూర్‌లోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై ‘హైడ్రా’ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చెరువు ఆక్రమణల నివారణ చర్యల్లో భాగంగా ఎఫ్‌టీఎల్ స్థలంలో నిర్మించిన ఓ భారీ షెడ్డును అధికారులు తొలగించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే, తమ ఆస్తులపై గత 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని, అధికారుల చర్యలతో తీవ్రంగా నష్టపోయామని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎఫ్‌టీఎల్ హద్దులను స్పష్టంగా నిర్ణయించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు.
రామాంతపూర్ వద్ద హైడ్రా కూల్చివేతలు.. బాధితుల ఆవేదన!
