Breaking News

పట్టణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరాహార దీక్ష!

నూతన బస్టాండ్, సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

చెరువు సుందరీకరణ పనుల్లో అవకతవకలపై విచారణ జరపాలి

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: పట్టణ అధ్యక్షుడు దోనికెల నవీన్

మెట్‌పల్లి, నవంబర్ 16 (E6tv NEWS).మెట్‌పల్లి పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మెట్‌పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు దోనికెల నవీన్ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతోనే నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణాన్ని చేపట్టాలని, సమీకృత కూరగాయల మార్కెట్ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమృత్-2 పథకం కింద చెరువు సుందరీకరణ కోసం రూ.3 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని ఆరోపించారు. కేవలం రూ.10 నుంచి రూ.15 లక్షల విలువైన పనులు మాత్రమే జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, రూ.65 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పనులపై సమగ్ర విచారణ జరిపి నాణ్యతా ప్రమాణాలు పాటించని అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాత బస్టాండ్, ఆర్టీసీ డిపో, ఆరపేట చౌరస్తా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్లు, ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. రైతులు పండించిన పంటలకు నష్టం కలగకుండా ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం అధికార యంత్రాంగం బాధ్యత అని, ప్రజల ఇబ్బందులను నిర్లక్ష్యం చేయడం సరికాదని నవీన్ పేర్కొన్నారు. నిరాహార దీక్షకు అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరాహార దీక్షకు ముఖ్య అతిథులుగా బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాసన్, రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్ డాక్టర్ గంగసాగర్ హాజరై సంఘీభావం తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు జుంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీష్, కలికోట శ్రీకాంత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, బొడ్ల వసుధ, నాగేష్, కోయల్కార్ స్రవంతి, లింగేశ్వర్, పూడికారపు దివ్య, కిషోర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు లోలపు అనిల్, కొయ్యల లక్ష్మణ్, గుంటుక హనుమాన్లు, భోగ దత్తు, ఐటీ సెల్ కన్వీనర్ పాస్‌కంటి శ్రీనివాస్, తిరుసుల్లా అర్జున్, కిషన్ మోర్చా అధ్యక్షుడు బొడ్ల అనిల్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సంకు ప్రసాద్, సుంకే అశోక్, కళాలి రాజిరెడ్డి, శంభోజి శ్రీధర్ ఆచారి, గుండు మోహన్, గుండు ప్రభాకర్, దండిగా నరసయ్య, రఘుపతి, మొగిలిపాక హరికృష్ణ, మహిళా నాయకురాళ్లు గొంగళ్ల రజిని, వంగ లాస్య, మల్లాపూర్ మండల ఉపాధ్యక్షుడు రాజా గౌడ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *