Breaking News

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క!

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.. కష్టసుఖాల్లో అండగా ఉంటా

లండన్ పర్యటన ముగించుకొని బాన్సువాడకు చేరుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి.. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం

కోటగిరి, నవంబర్ 17: (E6tv NEWS).

లండన్ పర్యటనను ముగించుకొని స్వదేశానికి చేరుకున్న బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేలా పర్యటన చేపట్టారు. కోటగిరి గ్రామానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కార్యకర్తలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని సూచిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క!

ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తనను నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారి కృషి, త్యాగాలు, నిబద్ధతే పార్టీ రాజకీయ ప్రస్థానానికి పునాదులని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉంటేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఆయన భరోసాతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గంధపు దత్తు దంపతుల సన్మానం

ఈ సందర్భంగా పోతంగల్ ఉమ్మడి మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, జన సంఘర్షణ రిపోర్టర్ గంధపు దత్తు తన సతీమణితో కలిసి ఏనుగు రవీందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. లండన్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంగా ఆయనకు, ఆయన సతీమణికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అభినందనలు తెలియజేశారు.లండన్ పర్యటన అనంతరం నియోజకవర్గానికి చేరుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవడం, భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పర్యటనతో బాన్సువాడ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *