పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, నవంబర్ 17: (E6tv NEWS).
శేరిలింగంపల్లి సర్కిల్-49, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మలేంపాటి ఐఏఎస్, తెలంగాణ యాదవ కురుమ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ ఇస్లావత్ నాయక్, మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అర్హులైన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరూ పెన్షన్‌కు దూరం కాకూడదనే లక్ష్యంతో డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీ, కాలనీలో సర్వే నిర్వహించి అర్హులందరికీ పెన్షన్లు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, వార్డు మెంబర్లు కవిత, పర్వీన్ బేగం, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



