Breaking News

బైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని యువకుడు మృతి

నిర్మల్ జిల్లా, నవంబర్ 18: (E6TV NEWS).

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో గోకుల్ నగర్‌కు చెందిన నాగేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

నాగేష్ బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతకు బైక్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోగా, బస్సు ముందు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర గాయాలతో నాగేష్ ప్రాణాలు కోల్పోయాడు.ప్రమాద శబ్దం విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న బైంసా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

యువకుడు నాగేష్ మృతితో గోకుల్ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *