Breaking News

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

నిర్మల్, నవంబర్ 18:(E6tv NEWS).

నిర్మల్ జిల్లాలో కుటుంబ కలహాలు, భర్త వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.వివరాల్లోకి వెళ్తే.. భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను సఖి కేంద్రానికి తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చిన మహిళ మరోసారి తీవ్ర మనస్తాపానికి గురై ఓ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె తల్లి, ఇద్దరు పిల్లలు సైతం అక్కడికి చేరుకుని బతిమిలాడినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *