ఆపదలో ఉన్న కుటుంబాలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత
కోటగిరి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. పాల్గొన్న బర్ల మధుకర్, కాంగ్రెస్ నాయకులు
కోటగిరి, నవంబర్ 19: (E6tv NEWS).
అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) భరోసాగా నిలుస్తోందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారికి అండగా నిలవడం అభినందనీయమన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కోటగిరి మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ఫోరం అధ్యక్షుడు, సర్పంచుల అధ్యక్షుడు బర్ల మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు అభినందనలు తెలిపారు.
